Auto Expo 2023 : కియా కొత్త కారు

Auto Expo 2023 :  కియా కొత్త కారు

గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో నేషనల్, గ్లోబల్ కంపెనీలు తమ సరికొత్త ఉత్పత్తులను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనేకియా కొత్త ఎంపీవీ (MPV), ఎలక్ట్రిక్ ఎస్ యూవీ (SUV)  కాన్సెప్ట్‌ కార్లను ఎక్స్ పోలో ప్రదర్శించింది. ‘EV9’,  MPVని ‘KA4’  పేర్లతో ఈ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు కార్నివల్ గా పిలిచే MPV కార్లని భారతీయ మార్కెట్లోకి KA4 గా తీసుకొస్తుండటం విశేషం. 

MPV అయినా ఈ కార్లు SUV స్టైల్ ను పోలి ఉంటాయి. అంతేకాదు క్లాస్-లీడింగ్ ఇంటీరియర్ స్పేస్‌తో వస్తుంది. KA4 కార్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఈ కార్ల పూర్తి వివరాలు వెల్లడిస్తామని కియా ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న కార్నివాల్‌ కార్ల ఉత్పత్తి నిలిపివేసి దాని స్థానంలో KA4  కార్లను తీసుకొస్తున్నట్లు కియా వెల్లడించింది.