హైదరాబాద్: దక్షిణ కొరియా ఆటో మేకర్ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లిపోతున్నదంటూ వచ్చిన వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. తాము ఏపీలోనే కొనసాగుతామని శుక్రవారం ప్రకటించింది. ప్లాంటును అనంతపురం నుంచి తరలించడానికి తమిళనాడు ఆఫీసర్లతో చర్చలు జరిపారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం అందుతోందని తెలిపింది. ప్రపంచస్థాయి వాహనాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తామని తెలిపింది. అనంతపురం ప్లాంటు కోసం ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
