హైదరాబాద్, వెలుగు: కియా ఇండియా కేరెన్స్ పేరుతో మిడ్‌రేంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను ఇండియా మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. ఏడుగురు కూర్చోగల ఈ వెహికల్ ఎక్స్‌షోరూం ధరలు రూ.9 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటాయి. ఇది ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రెస్టిజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో వస్తుంది. కేరెన్స్ డీజిల్ వేరియంట్ లీటరుకు 21.3 కిలోమీటర్లు, పెట్రోల్ వెర్షన్ 16.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్ట్ యాప్, 10.25ఇంచుల టచ్‌స్క్రీన్ నావిగేషన్, ఎనిమిది స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైరస్, బాక్టీరియా నుంచి రక్షించే స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా కేరెన్స్ - స్మార్ట్‌స్ట్రీమ్ 1.5-లీటర్ పెట్రోల్, స్మార్ట్‌స్ట్రీమ్ 1.4-లీటర్ టీజీడీఐ పెట్రోల్,1.5-లీటర్ సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజన్లతో వస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, సెవెన్-స్పీడ్ డీసీటీ, సిక్స్ -స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్లు ఉంటాయి. కేరెన్స్‌ను ఇండియాలోనే తయారు చేశామని, దీనిని 80 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
