టీడీపీ నేత బండారు మనిషే కాదు.. ఖుష్బూ

మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు బండారు సత్యనారాయణ వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

రోజాకు నా పూర్తి మద్దతు ఉంటుందని.. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతానన్నారు ఖుష్బూ. రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడని ఫైర్‌ అయ్యారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భం ఇది.. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులు అంటూ ఖుష్బూ నిప్పులు చెరిగారు.