అయోధ్యకు KFCకి గ్రీన్ సిగ్నల్.. కండీషన్స్ అప్లయ్ అంట

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తరవాత పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకి తరలి వస్తున్నారు. ఫలితంగా...నగరమంతా మిగతా వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుండడం వల్ల రకరకాల ఫుడ్‌స్టాల్స్ వెలుస్తున్నాయి. వెజిటేరియన్ ఫుడ్‌ స్టాల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. 

అయోధ్యని దర్శించేందుకు వచ్చిన వాళ్లు ఇక్కడ అన్ని రకాల రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. రామ మందిరానికి కిలోమీటర్‌ దూరంలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే KFC కూడా ఇక్కడ ఔట్‌లెట్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే... పవిత్రమైన అయోధ్య క్షేత్రంలో KFC ఎలా పెడతారన్న వాదనలు వినిపించాయి. Panch Kosi Parikrama కి సమీపంలో ఫుడ్‌స్టాల్స్ పెట్టుకోడానికి ప్రభుత్వం అనుమతినిస్తున్నప్పటికీ మాంసాహారం విక్రయించడానికి మాత్రం వీల్లేదని తేల్చి చెప్పింది. మద్యం అమ్మకాలూ కుదరవని స్పష్టం చేసింది. 

అయోధ్యలో బడా ఫుడ్‌ చైన్ ఔట్‌లెట్స్ పెట్టుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం వాళ్లని సాదరంగా స్వాగతిస్తాం. కానీ...కొన్ని కండీషన్స్ పాటించాలి. ఆ స్టాల్స్‌లో మాంసాహారం విక్రయించకూడదు. మద్యం విక్రయాలకూ వీల్లేదంటూ  అయోధ్యలోని ప్రభుత్వ అధికారి విశాల్ సింగ్ తెలిపారు.  అయోధ్యలో తమ దుకాణాలను ఏర్పాటు చేయడానికి పెద్ద ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌ల నుండి మాకు ఆఫర్‌లు ఉన్నాయని అన్నారు

ప్రస్తుతానికి  Parikrama Marg కి వెలుపల KFC ఔట్‌లెట్స్ ఉన్నాయి.  అయోధ్యలోనే ఏర్పాటు చేయాలని KFC భావించినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. శాకాహారం మాత్రమే విక్రయిస్తే KFC కూడా స్టాల్‌ పెట్టుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.రామ మందిరానికి దగ్గర్లో ఉంటేనే తమ మార్కెట్ బాగుంటుందని చాలా వరకూ సంస్థలు భావిస్తున్నాయి. రామ మందిరానికి 8 కిలోమీటర్ల దూరంలో పిజా హట్‌ ఏర్పాటైంది. ఇక్కడ మంచి డిమాండ్ ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. 

ప్రస్తుతం అయోధ్య- లక్నో హైవేపై ఉన్న కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) కూడా ఆలయ ప్రాంతంలో పనిచేయడానికి అనుమతించబడింది, అయితే వారు శాఖాహార ఎంపికలను మాత్రమే అందించాలని కోరారు. పవిత్ర దేవాలయం కారణంగా, రామాయణానికి సంబంధించిన పవిత్ర స్థలాలను కలిగి ఉన్న ఆలయ పట్టణం చుట్టూ ఉన్న 15 కిలోమీటర్ల పుణ్యక్షేత్రమైన పంచ కోసి పరిక్రమ మార్గ్‌లో మద్యం, మాంసం  విక్రయాలపై అధికారులు  ఆంక్షలు విధించారు.