ఆయన లేరా: ఫిల్మ్ ఛాంబర్‎లో కీలక మీటింగ్.. పుష్ప బాధితులకు సాయం చేయాలని నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆర్థిక సహయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విరాళాలు సేకరించాలని డిసైడ్ అయ్యింది ఫిల్మ్ ఛాంబర్. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు 2024, డిసెంబర్ 23వ తేదీన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రకటన విడుదల చేసింది. విరాళాలు సేకరించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఇందులో పేర్కొంది. 

సభ్యులు తమకు తోచిన సహయం చేయాలని.. డొనేషన్ ఇవ్వడం తప్పని సరికాదని.. ఇష్టాపూర్వకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‎సీ వివరాలు వెల్లడించిన టీఎఫ్‎సీ.. ఆ ఖాతాకు డొనేషన్ పంపాలని సూచించింది.  కాగా, పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్న  సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది.

ALSO READ : పుష్ప2 ప్రీమియర్ షో దెబ్బ: సీఎంతో మీటింగ్కు బడా నిర్మాతల తహతహ.. సంక్రాంతి సినిమాల బెన్ఫిట్ షో కోసమేనా ?

ఒక్కరాత్రి జైల్లో ఉండివచ్చిన అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన సినీ సెలబ్రెటీలు.. అదే సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడిని సినీ ప్రముఖులు పరామర్శించకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే తప్పుబట్టారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోస్ ఉండవని.. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అప్రమత్తమై.. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ పై చర్చించేందుకు సోమవారం (డిసెంబర్ 23) అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలోనే రేవతి కుటుంబానికి ఆర్థిక సహయం చేయాలని నిర్ణయించింది టీఎఫ్‎సీ.