అయ్యప్ప ప్రసాదం ఎలా తయారు చేస్తారో తెలుసా...

ఒక్కో దేవాలయంలో ఒక్కో ప్రసాదం లభిస్తుంది.  తిరుపతి లడ్డూ.. భద్రాచలం రామయ్య పులిహార,  విజయవాడ దుర్గమ్మ వారి లడ్డూ.. ఇలా ఒక్కో దేవాలయంలో ఒక్కో ప్రసాదం లభిస్తుంది.  కేరళ శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రసాదంగా లభించే అరవడి పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది.  చలికాలంలో ఇది తింటే ఆరోగ్యం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  అయితే ఇప్పుడు ఈ అరవడి పాయసాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం. . .  .

 శబరిమల(Shabarimala) అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. కేరళ అయ్యప్ప స్వామి ఆలయం(Ayyappa Swami Temple) లో లభ్యమయ్యే ఈ ప్రసాదం వెరీ వెరీ స్పెషల్. అయితే ఈ ప్రసాదం తరహాలోనే కేరళలో పూజలు, పర్వదినం సమయాల్లో అరవణ  పాయసాన్ని తయారు చేస్తారు. ఇది కూడా అయ్యప్ప ప్రసాదంలా ఎంతో రుచిగా ఉంటుంది. కేరళ స్పెషల్  సాంప్రదాయ ప్రసిద్ధ అరవణ పాయసం తయారు చేయడం చాలా సులభం.  కేరళ స్పెషల్ అరవణ పాయసం తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

 కావాల్సిన పదార్ధాలు

  • ఎర్రబియ్యం           :            ఒక కప్పు 
  • నల్ల బెల్లం రెండు  :            కప్పుల పొడి 
  • నెయ్యి                     :             తగినంత  
  •  పచ్చి కొబ్బరి ముక్కలు  :   ఒక కప్పు
  •  జీడిపప్పులు         :             2 టీ స్పూన్​ లు
  • శొంఠి పొడి              :              2 టీస్పూన్లు
  •  నీళ్లు                        :               6 కప్పులు

తయారీ విధానం

ముందుగా నల్ల బెల్లం తురుముని తీసుకుని దానిని ఒక గిన్నెలో వేసుకుని కరిగించాలి. ఒక పాన్ తీసుకుని నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అనంతరం వాటిని తీసివేసి.. మళ్ళీ  జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యం తీసుకుని దానిని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించే  సమయంలోనే  నీటిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అనంతరం అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. దీనిలో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి.  తర్వాత కొంచెం  శొంఠి పొడిని కలిపి.. నెయ్యి వేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే.. స్టౌ ఆఫ్ చేసి.. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే..  కేరళ శబరిమల అరవణ పాయసం  ప్రసాదం రెడీ అవుతుంది.  తరువాత స్వామివారికి నివేదించిన ప్రసాదంగా తినవచ్చు. 

ఈ అరవణ పాయసం చూడడానికే కాదు.. రుచికి కూడా శబరిమల ప్రసాదం తరహాలోనే ఉంటుంది.  దీన్ని బియ్యం, బెల్లం, నెయ్యిలతో ఎంతో రుచిగా శుచిగా  తయారు చేస్తారు. ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి తగిన పోషకాలను కూడా ఇస్తుంది.