పెళ్లికి ఒప్పుకోలేదని గంజాయి కేసులో ఇరికించారు

పెళ్లికి ఒప్పుకోలేదని గంజాయి కేసులో ఇరికించారు

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ మహిళలను ఏకంగా గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. అంతేకాదు ..ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్టు కూడా చేయించాడు. ఈ కేసు నుంచి ఆమె బయటపడేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. కేరళలోని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శోభా విశ్వనాథ్‌కు, తిరువనంతపురంలోని లార్డ్స్‌ ఆస్పత్రి CEO హరిదాస్‌తో పరిచయం ఉంది. ఈ చనువుతోనే హరీశ్‌.. శోభాను ప్రపోజ్ చేశాడు. అయితే పెళ్లికి ఆమె నిరాకరించింది. దీంతో అతను..ఆమెపై కక్ష్యపూరితంగా వ్యవహరించాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్‌రాజ్‌ సాయంతో ఇంటి లోపల గంజాయి పెట్టించి పోలీసులచే అరెస్టు చేపించారు.  ఆ కేసు ఆ రాష్ట్ర సీఎం దృష్టికి వెళ్లడంతో క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. వీరి దర్యాప్తులో శోభా విశ్వనాథ్‌ నిర్దోషిగా తేల్చారు.

తనకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగకూడదని ఆవేదన్ వ్యక్తం చేశారు శోభా విశ్వనాథ్‌. మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతానని తెలిపారు.