మీసాలు తిప్పడం మగాళ్లకే సొంతమా.. నాకేం తక్కువ అంటూ మీసాలు తిప్పేస్తోంది ఓ మహిళ. నా మీసాలు నా ఇష్టం అందులో వేరొకరి ప్రమేయం ఏంటీ అంటూ తెగేసీ చెప్తోంది. కేరళకు చెందిన ఓ యువతి మీసాలు మెలి తిప్పుతున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ఫొటో వెనకున్న సంగతులేంటీ అని ఆరా తీస్తే.. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల షైజాకు సాధారణంగా ముఖం మీద, గడ్డం మీద పెరిగిన వెంట్రుకలను చూసుకొని ఆమె.. గర్వంగా ఫీలవుతోంది. తాను మీసాలు పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసేయడం తనకు ఏ మాత్రమూ ఇష్టం లేదని తెలిపింది. ఈ మీసం తనకు గర్వకారణమని పేర్కొంది. మీసం గురించి తనను ఎగతాళి చేస్తారని వాపోయింది. "పురుషులకు మీసాలు ఉంటాయి.. మహిళకు మీసాలు ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నిస్తారు.. కానీ అది నాకు నచ్చింది.. అందుకే నేను మీసం ఉంచుకున్నా.. నేనేందుకు మీసం ఉంచుకోకూడదు’’ అని షైజా ప్రశ్నించింది. ఈ విధమైన షైజా ధోరణిని కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని.. అసలు మీసాలు లేకుండా తాను జీవితాన్ని ఊహించకోలేనని షైజా తెలిపింది. కరోనా సమయంలోనూ తాను మీసాలను కప్పి, మాస్క్ ధరించడాన్ని చాలా భావించానని చెప్పింది. కాగా.. షైజా గత పదేళ్లలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఆరుసార్లు ఆపరేషన్లు జరిగాయని.. ఆపరేషన్ కోసం వెళ్లిన ప్రతీసారి ఇక వెళ్లాల్సిన అవసరం లేదని నమ్మెదాన్నంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా మహిళకు మీసాలుండడం ఇదేం కొత్తం కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
