దేశంలో కరోనా కొత్త కేసుల్లో 40 శాతం కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనివే

దేశంలో కరోనా కొత్త కేసుల్లో 40 శాతం కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనివే
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతీ రోజూ 20వేల కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మిగిలిన రాష్ట్రాల కంటే కేరళ, మహరాష్ట్రలలో ఎక్కువ కరోనా కేసులు నమోదు కాగా..,దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 40శాతం కరోనా కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు ట్వీట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. , వెస్ట్ బెంగాల్ లో  19,065 యాక్టీవ్ కేసులు నమోదు కాగా.., ఉత్తర్ ప్రదేశ్ (17,955) , ఛత్తీస్ గఢ్ (17,488), అరుణాచల్ ప్రదేశ్ (234), త్రిపుర (265) లో యాక్టీవ్ కేసులున్నట్లు ట్వీట్ లో పేర్కొంది.