కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ(సోమవారం) నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ జిల్లాలోని ధర్మాడం అసెంబ్లీ స్థానం నుంచి CPM అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పేపర్లను అధికారులకు సమర్పించారు. కేరళలో చాలాకాలంగా వామపక్ష పార్టీలన్నీ కలిపి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) గా ఏర్పడి ఎన్నిలక బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో LDF కూటమి మెజారిటీ స్థానాలు సాధించడంతో.. ఆ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన CPM కీలక నేత పినరయి విజయన్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
