కెన్​ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్​


మధ్యప్రదేశ్​లోని కెన్, ఉత్తరప్రదేశ్​ బెట్వా నదుల రివర్ ఇంటర్​ లింకింగ్​ నేషనల్​ ప్రాజెక్టుకు మాజీ ప్రధాన మంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయి శత జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్​లోని ఖజురహోలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్​లోని 10 జిల్లాలకు చెందిన 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్​కు చెందిన 21 లక్షల మందికి తాగునీటి సౌకర్యంతోపాటు ఇరు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు ఇరిగేషన్​ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి 7.18 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. 

ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే హైడ్రో పవర్​ ప్రాజెక్ట్​ ద్వారా 103 మెగావాట్ల గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి చేయవచ్చు. అదే స్థాయిలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మెరుగైన నీటి నిర్వహణ, పారిశ్రామిక యూనిట్లకు తగినంత నీటి సరఫరా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటల ఉత్పత్తి పెరగడంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరప్రదేశ్​లో 59 వేల హెక్టార్లకు ఏడాది పొడవునా నీటిని అందించవచ్చు. మొత్తం 1.92 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థను స్థిరీకరించవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.44 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. 

  •     2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కెన్​–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ఒకేసారి కాకుండా దశలుగా విభజించి పనులు చేపట్టాలని నిర్ణయించింది. 
  •     అండర్​ గ్రౌండ్​ ప్రెషరైజ్డ్​ పైప్​ ఇరిగేషన్​ విధానంలో చేపడుతున్న దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్​ ఇది. 
  •     కెన్ – బెట్వా రివక్​ లింక్​ ప్రాజెక్ట్​ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్​పేయి శతజయంతిని పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను,  రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. 
  •  1153 అటల్​ గ్రామ్​ సుశాన్​ బిల్డింగ్​లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయడంతోపాటు ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్​ ఫ్లోటింగ్​ సోలార్​ ప్రాజెక్టును కూడా వర్చువల్​గా ప్రారంభించారు.
  • కెన్, బెట్వా నదులు
  •     కెన్​, బెట్వా నదులు మధ్యప్రదేశ్​లో ఉద్భవించాయి. ఈ రెండు నదులు యమునా 
  • నదికి ఉపనదులు.
  •     కెన్​ నది ఉత్తరప్రదేశ్​లోని బండా జిల్లాలో యమునా నదిలో హమీపూర్​ జిల్లాలోని బెట్వా నదితో కలుస్తుంది. 
  •     రాజ్​ఘాట్​, పరిచా, మటాటిటా ఆనకట్టలు బెట్వా నదిపై ఉన్నాయి. కెన్​ నది పన్నా టైగర్​ రిజర్వ్​ గుండా ప్రవహిస్తుంది.