నేను గోవాలో పెళ్లి చేసుకుంటున్నాను : తిరుమలలో చెప్పిన కీర్తి సురేష్

మహానటి కీర్తీ సురేష్ (Keerthy Suresh) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిళ్‌ని (Antony Thattil) పెళ్లి చేసుకోనుంది. ఇటీవలే తన పెళ్లిని అధికారికంగా ప్రకటించిన కీర్తీ సురేష్.. ఇవాళ శుక్రవారం (నవంబర్ 29న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also Read:-సిటాడెల్ సక్సెస్ పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన సమంత..

ఈ సందర్భంగా కీర్తీ సురేష్ మాట్లాడుతూ.. తన పెళ్లి వివరాలను తెలియజేసింది. గోవాలో వచ్చే నెల తన వివాహం ఆంటోనీతో జరగనుందని అన్నారు. కనుకే వివాహానికి ముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ థావన్ 'బేబీ జాన్' మూవీలో కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ మూవీ 2024 డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. కాగా వీరి వివాహం డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.