Keerthy Suresh Wedding: చిరకాల స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్

మహానటి కీర్తీ సురేష్ (Keerthy Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిళ్‌తో (Antony Thattil) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇవాళ గురువారం (డిసెంబర్ 12న) గోవాలో హిందూ సంప్రదాయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కీర్తీ పెళ్లి వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ForTheLoveOfNyke ❤️ అనే హ్యాష్‌ట్యాగ్ తో కీర్తి తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీర్తి మెడలో ఆంటోనీ మూడు ముళ్లు వేసిన ఫొటోతోపాటు ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటో కూడా ఉంది. అలాగే పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ కూడా ఈ పోస్టులో పంచుకుంది. ఇపుడీ ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. దాంతో ఈ జంటకు సెలబ్రిటీలతోపాటు కీర్తి ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తితో ఆంటోనీకి మంచి పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా ముడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇన్నాళ్లు ప్రియుడి వివరాల్ని గోప్యంగా ఉంచిన కీర్తి సురేశ్.. ఇటీవల పెట్టిన పోస్టుతో అందరికీ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం కీర్తి సురేష్‌ బేబీ జాన్ మూవీతో ఈ ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. త‌మిళంలో రివాల్వ‌ర్ రీటా, క‌న్నేవీడి, వెబ్ సిరీస్ 'అక్కా' లోను నటిస్తోంది.

ఎవరీ ఆంటోనీ..?

కేరళకు చెందిన ఆంటోనీ వ్యాపార వేత్తగా రాణిస్తున్నాడు. ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడని.. ప్రస్తుతం అతనికి కేరళలో పలు బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు అతనికి రూ.300 కోట్ల నెట్ వర్త్ ఉన్నట్లు సమాచారం.