ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగులను స్టేషన్‌‌‌‌లో ఉంచడం హేయం

  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

మెదక్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో నిర్బంధించడం హేయమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని రేవంత్‌‌‌‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని స్టేషన్‌‌‌‌కు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. 

సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్లు పీకేయడం కాదు.. వారి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్‌‌‌‌ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని, వారిని రెగ్యులరైజ్‌‌‌‌ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌‌‌‌రెడ్డి.. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, రోడ్డెక్కి నిలదీసిన వారిని అక్రమ నిర్బంధాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.