సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీరంగం వెళ్లిన ఆయన.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంగనాథస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్, ఆయేన సతీమణి శోభ, కేటీఆర్, ఆయన బార్య నీలిమ, వారి పిల్లలు.. పూజల్లో పాల్గొన్నారు. సీఎం కుటుంబానికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక.. తిరుచిరాపల్లి ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నై చేరుకుంటారు కేసీఆర్. రాత్రి చెన్నైలోని ITC గ్రాండ్ హోటల్ లో బసచేస్తారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ కానున్నారు. తిరుత్తనిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కేసీఆర్-స్టాలిన్ భేటీ కానున్నారు.
#WATCH | Tamil Nadu: Telangana CM K Chandrashekar Rao visited Sri Ranganathaswamy Temple, Srirangam in Tiruchirappalli, earlier today pic.twitter.com/GLf7PY8IsH
— ANI (@ANI) December 13, 2021
