బీసీసీఐ ఉమెన్స్ టీమ్కు ఎంపికైన కరీంనగర్ శ్రీవల్లి

కరీంనగర్ టౌన్,వెలుగు: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే జట్టుకు కరీంనగర్ కు చెందిన కట్ట శ్రీవల్లి ఎంపికయ్యారు.  మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మహిళల సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్, సభ్యులు సమావేశమయ్యారు. వచ్చే నెల 4న అహ్మదాబాద్ లో జరగనున్న బీసీసీఐ  సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్  శ్రీవల్లి ప్రాతినిథ్యం వహిస్తారు. సిటీలోని శ్రీపురం కాలనీకి చెందిన కట్ట ఉమారాణి, లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కూతురు కట్ట శ్రీవల్లి కరీంనగర్ నుంచి  క్రికెట్ టీంలో ఎంపికైన తొలి మహిళ. కరీంనగర్ జిల్లా పేరు జాతీయ స్థాయిలో నిలపడం గర్వకారణం. ఆమె అహ్మదాబాద్ లో డిసెంబర్ 4 న జరిగే మ్యాచ్ లోనూ ఆడనుంది.