WBBL 2024: ఇది కదా క్యాచ్ అంటే.. మోకాళ్లతోనే ఒడిసి పట్టేసింది

మహిళల బిగ్ బాష్ లీగ్ లో అద్భుతమైన క్యాచ్ నమోదయింది. బ్రిస్బేన్ హీట్ ఉమెన్, అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ క్యాచ్ అందరిని షా కు గురి చేస్తుంది. బ్రిస్బేన్ హీట్ ఉమెన్ ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 17 ఓవర్లో కేటీ మాక్ మోకాళ్లతోనే క్యాచ్ అందుకొని ఔరా అనిపించింది. బార్సీబీ వేసిన 17 ఓవర్ చివరి బంతిని  చార్లీ నాట్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడింది. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో లాంగాన్ లో ఫీల్డింగ్ లో చేస్తున్న కేటీ మాక్ దగ్గరకు క్యాచ్ వచ్చింది.
 
తొలి ప్రయత్నంలో ఆమె క్యాచ్ అందుకోవడంలో విఫలమైంది. అయితే ఇక క్యాచ్ చేజారిందనుకున్న సమయంలో తన తెలివిని ప్రదర్శించింది. డైవ్ చేసి కిందపడిన మాక్.. తన రెండు మోకాళ్ళతో బంతిని కింద పడకుండా ఆపి క్యాచ్ అందుకుంది. దీంతో నాట్ 7 పరుగులకే పెవిలియన్ కు చేరుకుంది. క్రికెట్ చరిత్రలోనే ఇదొక అద్భుత మ్యాచ్ అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ALSO READ : AUS vs IND: ప్రాక్టీస్ మ్యాచ్‌లు దండగ: వరుసగా రెండో టెస్టులోనూ ఆసీస్‌పై భారత్ ఓటమి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ ఉమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి కష్టాల్లో పడింది.