విదేశీ వస్తువలకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనకు తెలియకుండానే చాలా విదేశీ వస్తువులు జీవితంలో భాగమయ్యాయన్నారు. స్వదేశీ వస్తువుల వాడకం పెంచి మన భారతీయుల శ్రమకు గుర్తింపునివ్వాలన్నారు. ఈఏడాదిలో చివరి మన్ కీ బాత్ లో మాట్లాడారు ప్రధాని మోడీ. వోకల్ ఫర్ లోకల్లో భాగంగా ఇండియా నుంచి ది బెస్ట్ ప్రోడక్ట్స్ ని ప్రపంచానికి అందించాలన్నారు. మ్యూనుఫ్యాక్చరర్స్, పారిశ్రామిక వేత్తలు దీన్ని సవాలుగా తీసుకోవాలన్నారు. మనం తయారు చేసే వస్తువులు క్వాలిటీగా ఉంటేనే ప్రజలు కొంటారన్నారు. దేశ ప్రజలు కుంకుమ పువ్వు కొనాలన్నారు. కశ్మీర్ కుంకుమ పువ్వు రుచి ప్రత్యేకంగా ఉంటుందని మోడీ అన్నారు. కశ్మీర్ కుంకుమ పువ్వుకు జీఐ ట్యాగ్ ఇవ్వబడిందన్నారు… కశ్మీరీ కుంకుమ పువ్వును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నామన్నారు.
In May this year, the Kashmiri saffron was given the Geographical Indication Tag or GI tag. Through this, we want to make Kashmiri saffron a globally popular brand: PM Modi during 'Mann Ki Baat' pic.twitter.com/X0Eq5roWET
— ANI (@ANI) December 27, 2020
