బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేసి.. వీడియోల రూపంలో ట్రోల్ చేయడం మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్ కు చెందిన ఫైసల్ వానీ అనే యూట్యూబర్ కూడా ఓ వీడియోను క్రియేట్ చేసి.. పోస్ట్ చేశాడు. నుపుర్ శర్మ తల నరికినట్లుగా వీఎఫ్ఎక్స్ చేసిన ఈ వీడియో అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది.దీంతో అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి. కాగా ఈ గొడవలు ఎక్కువవడానికి కారణమైన యూట్యూబర్ ను అరెస్టు చేసి.. పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా తాజాగా యూట్యూబర్ ఫైసల్ వానీ తన చర్యలకు క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.ఇప్పటికే తన ఛానెల్ నుండి వానీ ఆ గ్రాఫిక్ వీడియోను తొలగించగా.. ఆ వీడియో పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫైసల్ వాని స్పందిస్తూ.. "శుక్రవారం రాత్రి ఈ వీడియోను అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోలో గ్రాఫిక్స్ చేసాను. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కానీ నేను ఎలాంటి దురుద్దేశంతోనూ ఈ వీడియో చేయలేదు.అ తర్వాత వీడియోను కూడా తొలగించాను. నా వల్ల ఎవరినైనా బాధపెడితే క్షమించండి ”అంటూ డీప్ పెయిన్ ఫిట్ నెస్ అనే తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోను పోస్ట్ చేసి, సందేశాన్ని చేరవేశాడు.
