కరుణ్‌ నాయర్‌‌‌‌‌‌‌ వరల్డ్ రికార్డు

విజయనగరం: విదర్భ స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ (101 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 112).. లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ రికార్డు నెలకొల్పాడు. ఔట్‌‌‌‌ కాకుండానే అత్యధిక రన్స్‌‌‌‌ (542) చేసిన తొలి ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. తద్వారా 2010లో న్యూజిలాండ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ జేమ్స్‌‌‌‌ ఫ్రాంక్లిన్‌‌‌‌ (527) నెలకొల్పిన రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో నాయర్‌‌‌‌ ఈ ఘనత సాధించాడు. అయితే అటల్‌‌‌‌ బిహారి రాయ్‌‌‌‌ (1/50) బౌలింగ్‌‌‌‌లో నాయర్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో ఈ రికార్డు ఇక్కడితోనే ఆగిపోయింది. 

నాయర్‌‌‌‌తో పాటు యష్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ (138) కూడా సెంచరీ కొట్టడంతో ఈ మ్యాచ్‌‌‌‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో యూపీని ఓడించింది. ముందుగా యూపీ 50 ఓవర్లలో 307/8 స్కోరు చేసింది. సమీర్‌‌‌‌ రిజ్వి (105) సెంచరీ కొట్టాడు. తర్వాత విదర్భ 47.2 ఓవర్లలో 313/2 స్కోరు చేసి గెలిచింది.  యష్‌‌‌‌, నాయర్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 228 రన్స్‌‌‌‌ జోడించి ఈజీగా మ్యాచ్‌‌‌‌ గెలిపించారు. యష్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు దక్కింది.

లిస్ట్ ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు

  • 1. కరుణ్ నాయర్: 542 పరుగులు
  • 2. జేమ్స్ ఫ్రాంక్లిన్: 527 పరుగులు
  • 3. జాషువా వాన్ హీడ్రెన్: 512 పరుగులు
  • 4. ఫఖర్ జమాన్ : 455 పరుగులు
  • 5. తౌఫీక్ ఉమర్: 422 పరుగులు