శ్రీశైలంలో కార్తీకమాస శివదీక్షల విరమణ ప్రారంభం

శ్రీశైలంలో కార్తీకమాస శివదీక్షల విరమణ ప్రారంభం
ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు శివ దీక్షల విమరణ కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన భూ కైలాసగిరి శ్రీశైలంలో కార్తీక మాస శివదీక్షల విరమణ ప్రారంభమైంది. ఇవాళ్టి నుండి ఐదు రోజులపాటు దీక్షల విమరణ కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు. దీక్షల విరమణ కార్యక్రమం సందర్భంగా దీక్షాధారులై వచ్చిన భక్తులతోపాటు ఇతర సాధారణ భక్తులకు కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు దేవస్థానం అధికారులు. కరోనా నిబంధనల కారణంగా శివ దీక్షా ధారులకు దూరదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుండి స్పర్శదర్శనం నిలిపివేశారు. అందరికీ దూరదర్శనమే. అయితే శివదీక్ష స్వీకరించిన భక్తులకు ప్రత్యేక దర్శనము క్యూ లైన్ ద్వారా నిర్ణీత వేళలో స్వామివార్ల దర్శనం జరిగేలా చూస్తున్నారు. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. శివదీక్షల విరమణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీకుమారస్వామి వారికి విశేష  అభిషేకం జరిపించారు. సాయంకాలం  నందీశ్వర స్వామి ( శనగలబసవన్న) వారికి విశేషపూజలు, బయలు వీరభద్రస్వామి వారికి విశేషపూజలు జరుగుతాయి.