కర్నాటక ‘మున్సిపోల్స్’​లో కాంగ్రెస్‌‌‌‌ హవా

కర్నాటక ‘మున్సిపోల్స్’​లో కాంగ్రెస్‌‌‌‌ హవా

బెంగళూరు:  కర్నాటక అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 58 అర్బన్ లోకల్ బాడీల్లోని 1,184 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 498 సీట్లలో గెలిచింది. బీజేపీ 437, జేడీఎస్ 45, ఇతరులకు 204 స్థానాలు వచ్చాయి. ఇక, 166 సిటీ మున్సిపల్ కౌన్సిల్ వార్డుల్లో కాంగ్రెస్ 61, బీజేపీ 67, జేడీఎస్‌‌‌‌ 12 గెలవగా, ఇతరులు 26 స్థానాల్లో గెలిచారు. 441 టౌన్ మున్సిపల్ కౌన్సిల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 201, బీజేపీ 176, జేడీఎస్ 21 స్థానాలు గెలుచుకోగా.. 588 పట్టణ పంచాయతీల్లో కాంగ్రెస్ 236, బీజేపీ 194, జేడీఎస్ 12 వార్డులను కైవసం చేసుకున్నాయి.