కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కోసం రైతుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు..వినూత్నంగా నిరసన తెలిపారు.
వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ గ్గా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో కర్ణాటక ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు ఏకంగా మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలాడు. విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలిన కర్ణాటక రైతులు
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2023
కరెంటు ఇవ్వకుంటే విద్యుత్ సబ్ స్టేషన్ ఆఫీసులో మొసలిని వదులుతామని ఆందోళన చేస్తున్న కర్ణాటక రైతులు. pic.twitter.com/kpSkZKwWAV
అర్థరాత్రి విద్యుత్ సరఫరా చేస్తున్నారని..చీకట్లో పొల్లాలోకి వెళ్లి పంటలకు నీళ్లు పెట్టడం ఇబ్బంది అవతోందని మండిపడుతున్నారు. చీకట్లో పాములు, ఇతర జంతువుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆ ఇబ్బందులను ప్రత్యక్షంగా అధికారులకు తెలిపేందుకే ఇలా కరెంట్ ఆఫీసులో అధికారులపైకి మొసలిని వదిలినట్లు తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయానికి సరిపడా కరెంట్ పొద్దున పూట ఇవ్వాలని..లేదంటే విద్యుత్ సబ్ స్టేషన్ ఆఫీసులో ఆందోళలనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
