కర్ణాటకలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

కర్ణాటకలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
యూకేలో కొత్త వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో మిగతా దేశాలన్నీ భయాందోళనలకు గురవుతున్నాయి. దాంతో యూకే నుంచి వచ్చే విమానాలన్నింటిని పలు దేశాలు రద్దు చేశాయి. కొత్త వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. కర్ణాటక ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. మహారాష్ట్ర తరువాత కర్ఫ్యూ విధించిన రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ వైరస్ 70 శాతానికి పైగా తొందరగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ 72 గంటల్లో కోవిడ్ -19 ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘కరోనావైరస్ యొక్క కొత్త సమస్యను దృష్టిలో ఉంచుకుని.. డిసెంబర్ 23, మంగళవారం నుంచి జనవరి 2 వరకు, రాత్రి 10 నుంచి 6 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ప్రజలందరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నాను’ అని సీఎం బీఎస్. యెడియూరప్ప అన్నారు. ‘యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్‌ను నియంత్రించడానికి నైట్ కర్ఫ్యూ విధించారు. రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులను కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అంతర్రాష్ట్రంలో ఎటువంటి నిషేధం విధించబడలేదు. కొత్త నిబంధనలతో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలు లేదా పండుగ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి లేదు. ఈ నిబంధన అన్నింటికీ వర్తిస్తుంది’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు. For More News.. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీదే అధికారం: కాంగ్రెస్ మాజీ మంత్రి ఈ సినిమా చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది అప్పు ఎగ్గొట్టడానికి.. ఒకరిని చంపి తానే చచ్చినట్లు నమ్మించిన ఘనుడు లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ మర్డర్ ప్లాన్.. నిలిచిన రెండు ప్రాణాలు