గట్టు లిఫ్ట్ ను అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించేందుకు కృషి

గద్వాల, వెలుగు : గట్టు లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్​లో కర్నాటక మంత్రి బోసురాజుతో ఇరిగేషన్  మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్  సలహాదారుడు వేణుగోపాల్ తో కలిసి చర్చించినట్లు చెప్పారు. 

భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా గట్టు లిఫ్ట్ ను అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలనే విషయం చర్చకు వచ్చినట్లు తెలిపారు. నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్, జూరాల కింద రెండు పంటలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. విజయ్ కుమార్, రఘు వర్ధన్ రెడ్డి ఉన్నారు.