కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులను ఫిబ్రవరి16 వరకు పొడిగించింది. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ కోరారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, ఆన్‌లైన్ తరగతులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రీ-యూనివర్శిటీ, డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఫిబ్రవరి14న నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే హిజాబ్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇచ్చింది. ఫిబ్రవరి 14( సోమవారం) నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి క్లాసులు తిరిగి ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
Karnataka govt extends holidays for degree and diploma colleges till 16th February. #KarnatakaHijabRow
— ANI (@ANI) February 11, 2022
మరిన్ని వార్తల కోసం..
