కర్ణాటకలో మళ్లీ నైట్ కర్ఫ్యూ

కర్ణాటకలో మళ్లీ నైట్ కర్ఫ్యూ

కర్ణాటక లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతొ..ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయంటూ దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కేరళతో బోర్డర్ లో ఉన్న జిల్లాల్లో  అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలను అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.