కర్నాటకలో గణేష్ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్

కర్నాటకలో గణేష్ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్

బెంగళూరు: గణేష్ ఉత్సవాలకు కర్నాకట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిబంధనలు వర్తిస్తాయంటూ పలు షరతులు విధించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా నేపధ్యంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కర్నాటక ప్రభుత్వం మాత్రం బహిరంగ ప్రదేశాల్లో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతిస్తూ షరతులు పెట్టింది. ముఖ్యంగా కరోనా పాజిటివిటీ 2 శాతం కన్నా తక్కువ ఉన్న వార్డుల్లో మాత్రమే వీటిని అనుమతిస్తామని ప్రకటించింది. గణేష్ ఉత్సవాలపై కర్నాటక ప్రభుత్వం విధించిన షరతులు ఇలా ఉన్నాయి... 
ఈనెల 10న వినాయక చవితిని సాధారణంగా నిర్వహించుకోవాలి.
మైసూరులో దసరా ఉత్సవాలు కూడా నిరాడంబరంగా జరపాలి
గణేష్ ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి. కానీ 2 మంది మించరాదు.
ఆర్కెస్ట్రా, డీజే కార్యక్రమాలకు అనుమతి లేదు.
ఉత్సవాలపై పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి.
అపార్టుమెంట్లలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఓకె.
స్కూళ్లు, కాలేజీల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించరాదు.
పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి.
ఐదు రోజుల్లో నిమజ్జనం చేయాలి. ఎక్కడ నిమజ్జనం చేయాలో అధికారులే నిర్ణయిస్తారు.
పంచాయతీ, తాలుకా, నగరంలో ఎక్కడైనా సరే వార్డుకు ఒకచోట మాత్రమే గణేష్ మంటపం ఏర్పాటు చేయాలి.
పంచాయతీ, తాలుకాలలో ఎన్ని పెట్టాలో స్థానిక అధికారులు నిర్ణయిస్తారు.
ప్రజలకు ఇబ్బందిలేకపోతే చోట్ల 50 అడుగుల పొడవు, వెడల్పుతో మంటపం ఏర్పాటు చేయొచ్చు.
గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.