తెలంగాణ వడ్లను తేవద్దంటూ ఆందోళన .. హైవేపై కర్ణాటక రైతుల నిరసన

  • నారాయణపేట జిల్లాలో హైవేపై కర్ణాటక రైతుల నిరసన 

మాగనూర్, వెలుగు: తెలంగాణలో పండిన వడ్లను అమ్మకానికి తీసుకురావొద్దంటూ కర్ణాటక రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం దేవసూర్ బ్రిడ్జి దగ్గర నేషనల్ హైవేపై రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద బుధవారం కర్ణాటక రైతులు నిరసనకు దిగారు.  రాయచూర్ కు వెళ్లనీయకుం డా అడ్డుకోవడంతో తెలంగాణ రైతులు వెనక్కి వెళ్లిపోయారు. 

గతేడాది కర్ణాటకలో పండిన వడ్లను తెలంగాణలోని రైస్ మిల్లులకు లారీల్లో తరలిస్తుంటే అక్రమ ధాన్యం పేరిట అధికారులు సీజ్ చేశారని రాయచూరు జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు చామరాస మాలి పటేల్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే బోనస్ కోసం తమ వడ్లను తరలించట్లేదని, పాత వడ్లకు అధిక ధర వస్తుందనే తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి సమన్వయంతో రైతులు తమ వడ్లను అమ్ముకునేలా చూడాలని కోరారు.