కర్నాటకలో జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కర్నాటకలో జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం లాక్ డౌన్ ను జూన్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుత గడువు ఈనెల 24తో ముగియనుండగా కేసులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించకపోవడంతో  జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. ఇవాళ కూడా కొత్తగా 32,218 కరోనా కేసులు నమోదు కాగా, 353 మంది కరోనాతో మరణించారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మరో వైపు కొత్త కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా.. వైద్యం.. వ్యాక్సినేషన్ సమస్యలతో సతమతం అవుతున్న కర్నాటక లాక్ డౌన్ ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. అయితే బ్లాక్‌ ఫంగస్‌కు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచితంగానే చికిత్స అందిస్తామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. కరోనా కట్టడి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది.