కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షడు డీకే శివకుమార్​కు తప్పిన ప్రమాదం

కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షడు డీకే శివకుమార్​కు తప్పిన ప్రమాదం

కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షడు డీకే శివకుమార్​కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి కోలార్​కి హెలికాప్టర్​లో బయల్దేరారు.  ఈ క్రమంలో ఆకాశంలో ఉండగానే హెలికాప్టర్​ ని 100 అడుగుల ఎత్తులో ఉండగా రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్లు గాలి వేగానికి పెద్దవిగా మారాయి.

అయితే ముందుగానే  ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్​ హెలికాప్టర్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​​ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  కాగా హెలికాప్టర్​ అద్దం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ మేరకు డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే ఉండనుంది.  కాగా రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్​ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కన్నడ నాట ఈ సారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.