కర్ణాటక సీఎం యడియూరప్పకు  రూ. 25 వేలు జరిమానా

కర్ణాటక సీఎం యడియూరప్పకు  రూ. 25 వేలు జరిమానా
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా పిటిషన్ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది. కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు. డీనోటిఫికేషన్ ద్వారా మాజీ సీఎం కుమారస్వామి బంధువులకు కూడా లాభం జరిగిందని ఆయన ఆరోపించారు. తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా.. దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ. 25 వేల జరిమానా విధించారు.