కర్ణాటక బ్యాంక్ మరో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో ముందుకొచ్చింది. ఈసారి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు లేదా డిగ్రీ (లా/ అగ్రికల్చరల్ సైన్స్) లేదా సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల వారు డిసెంబర్ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: ఏదేని విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ (లా/ అగ్రికల్చరల్ సైన్స్) లేదా సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసిన వారు అర్హులు.
వయోపరిమితి: 01/ 11/ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్/ OBC/ ఇతరులు రూ. 800/- (పన్నులు అదనం) చెల్లించాలి. SC/ST అభ్యర్థులు రూ. 700/- (పన్నులు అదనం) చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు (స్కేల్-I) కింద రూ.48,480 చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ అలవెన్సులు అదనం. మెట్రో నగరాల్లో పని చేస్తే లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేది: 30/ 11/ 2024
- దరఖాస్తులకు చివరి తేదీ: 10/ 12/ 2024
- తాత్కాలిక పరీక్ష తేదీ: 22/ 12/ 2024
నోటిఫికేషన్ కోసం Karnataka Bank PO Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయండి.