దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక.. నాలుగో ప్లేస్‌లో తెలంగాణ

దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక.. నాలుగో ప్లేస్‌లో తెలంగాణ
ఇండియా ఇన్నొవేటివ్ ఇండెక్స్ విడుదల 36 అంశాలను లెక్కలోకి తీసుకున్న నీతి ఆయోగ్ న్యూఢిల్లీ: దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక తన స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత మహారాష్ట్ర రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసిన ఇండియా ఇన్నొవేటివ్ ఇండెక్స్ 2020లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇండెక్స్‌‌‌‌లో టాప్ 5లో మన తెలంగాణ కూడా ఉంది. తమిళనాడు మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో, కేరళ ఐదో స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, మణిపూర్ రాష్ట్రాలు టాప్ 3లో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, చండీఘడ్, డామన్ అండ్ డయూలు టాప్‌‌‌‌లో ఉన్నాయి. తొలిసారి ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌ను 2019 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇండియన్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌ను గ్లోబల్ ఇన్నొవేషన్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌తో సింక్ చేయడమే తమ లక్ష్యమని, ప్రపంచవ్యాప్తంగా 80 అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇండియాలో 36 అంశాలను లెక్కలోకి తీసుకుంటున్నామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఇండెక్స్ మూడో ఎడిషన్ తీసుకొచ్చే సరికి మిగిలిన పారామీటర్స్‌‌‌‌ను కూడా చేర్చుతామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్ 2020లో కొన్ని కొత్త ఇండికేటర్స్‌‌‌‌ను చేర్చారు. కొత్తగా చేర్చిన వాటిలో ఆర్ అండ్ డీపై రాష్ట్రాలు పెట్టే ఖర్చులు, రాష్ట్రాల్లో కొత్త వ్యాపారాల రిజిస్ట్రేషన్లను నీతి ఆయోగ్ లెక్కల్లోకి తీసుకుంది. ఇండియా తన తయారీ సామర్థ్యాలను, ఎగుమతులను పెంచుకునేందుకు ఈ ఇండెక్స్​ సాయం చేయనుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌‌‌‌లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు. హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ వంటి పలు పారామీటర్స్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలకు ర్యాంక్‌‌‌‌లు కేటాయించినట్టు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పాలసీలను రూపొందించేందుకు ఈ ఇండెక్స్‌‌‌‌లో తెలుసుకున్న అంశాలు ఉపయోగపడతాయని కాంత్ పేర్కొన్నారు. ఈ ఇండెక్స్‌‌‌‌ను నీతి ఆయోగ్, ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్‌‌‌‌నెస్‌‌‌‌లు కలిసి రూపొందించాయి. ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్‌‌‌‌పై అవుట్‌‌‌‌లుక్.. రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను 17 మేజర్ స్టేట్స్‌‌‌‌గా, 10 నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాలుగా, 9 సిటీ స్టేట్స్, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించింది. ఇలా వర్గీకరించిన రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును ఒకదానితో ఒకటి పోల్చిచూసింది. మొత్తంగా ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌ 2020 ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లో 36 ఇండికేటర్స్ ఉన్నాయి. వాటిలో 32 ఇండికేటర్స్ అత్యంత కీలకమైన, స్పెసిఫిక్ డేటాకు చెందినవి కాగా.. 4 కాంపోజిట్ ఇండికేటర్స్.  ముందటి ఏడాది మెథడాలజీని తీసుకునే ఇండియా ఇన్నొవేషన్‌‌‌‌ ఇండెక్స్ 2020ను అభివృద్ధి చేయగా.. మరికొన్ని కొత్త అంశాలను ఈసారి లెక్కల్లో యాడ్ చేసింది. ఈ అంశాలన్ని ఇండియా ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్‌‌‌‌ అవుట్‌‌‌‌లుక్‌‌‌‌ను వివరిస్తున్నాయి. జీడీపీలో ఆర్​ అండ్ డీపై ఎంత పర్సంటేజ్‌‌‌‌లో ఖర్చు చేస్తున్నారో  కొలుస్తూ ఈ సారి ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ని నీతి ఆయోగ్ అప్‌‌‌‌డేట్ చేసింది. For More News.. గూగుల్ పేని దాటేసిన ఫోన్‌పే