కర్నాటకలోని ఓ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ జరిపిన దాడిలో డ్రైనేజీ పైపు నుంచి రూ. 13 లక్షలతో సహా మొత్తం రూ. 54 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రైడ్ చేసినపుడు తీసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటకలోని కలబురగి జిల్లాలో ప్రజా సంక్షేమ శాఖ (పిడబ్ల్యుడి) జూనియర్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేసి అతని ఇంటిలోని డ్రైనేజీ పైపులలో ఒకదాని నుండి రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం రూ. 54 లక్షల నగదు దొరికిందని.. పిడబ్ల్యుడి జూనియర్ ఇంజనీర్ ఇంటిలోని డ్రైనేజీ పైపులలో ఒకదాని నుండి రూ. 13 లక్షలు ఉన్నాయని ACB పోలీసు సూపరింటెండెంట్ (ఈశాన్య రేంజ్) మహేష్ మేఘన్న నవర్ తెలిపారు.
#WATCH Karnataka ACB recovers approximately Rs 13 lakhs during a raid at the residence of a PWD junior engineer in Kalaburagi
— ANI (@ANI) November 24, 2021
(Video source unverified) pic.twitter.com/wlYZNG6rRO
