కరీంనగర్ డెయిరీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేత : ఇటు బల్దియాకు.. అటు నల్గొండ జీపీకి టోకరా

  • ఇటు కరీంనగర్ బల్దియాకు, అటు నల్లగొండ జీపీకి టోకరా
  • రీఅసెస్ మెంట్ చేయకపోవడంతో రూ.లక్షల్లో ఆదాయానికి గండి
  • రికార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా నమోదు 
  • నల్లగొండ జీపీ పరిధిలో ట్యాక్స్ మినహాయింపు కేటగిరీలో డెయిరీ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ డెయిరీ యాజమాన్యం మరో వివాదంలోకి చిక్కుకుంది. ఇటీవల కాలుష్యం బారినపడుతున్నామని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థానికులు ఆందోళనలు చేయడం, జగిత్యాలలో మిల్క్ కేక్ లో ఫంగస్ వచ్చినట్లు ఫిర్యాదులు అందడంతో వార్తల్లోకి ఎక్కిన డెయిరీ.. ట్యాక్స్ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఏటా సుమారు రూ.450 కోట్ల టర్నోవర్ కలిగిన సదరు సంస్థ.. స్థానిక సంస్థలకు రూ.లక్షల్లో ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటు కరీంనగర్ లో నిర్వహించే భారీ ప్లాంట్, కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నామమాత్రపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం, అటు తిమ్మాపూర్ మండలం నల్లగొండలో ఉన్న ప్లాంట్ కు అసలే ట్యాక్స్ చెల్లించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. బల్దియా, పంచాయతీ ఆఫీసర్లు కుమ్మక్కయ్యే కరీంనగర్ డెయిరీ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఏటా రూ.20 లక్షల దాకా చెల్లించాల్సి ఉండగా.. రూ.87 వేలతో సరి.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–వేములవాడ రోడ్డులోని పద్మానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ డెయిరీ ప్లాంట్ సుమారు ఏడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో డెయిరీ ఆఫీసు బిల్డింగ్స్, సీడ్ ఫ్యాక్టరీ రూమ్, మిల్క్ స్టోర్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ప్లాంట్, 12 రెసిడెన్షియల్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మెయిన్ రోడ్డు వైపు 34 షెట్టర్లు కలిపి మొత్తం 62 ఇంటి నంబర్లపై ఉన్నాయి. ఇందులో సీడ్ ఫ్యాక్టరీ రూమ్ పేరిట ఉన్న ఇంటి నంబర్ కు అత్యధికంగా ఆర్నెళ్ల ప్రాపర్టీ ట్యాక్స్ రూ.10,748, మిల్క్ స్టోర్ బిల్డింగ్ కు రూ.8,363, డైరెక్టర్ కేఎంపీఎల్ఎల్ పేరిట ఉన్న బిల్డింగ్ కు రూ.3,775 మినహా మిగతా అన్ని బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ.వెయ్యి లోపే ట్యాక్స్ ఉంది.

Also Read :- క్రీడలతో మానసిక ఉల్లాసం

కరీంనగర్ డెయిరీ పరిధిలోని నిర్మాణాల్లో అత్యధికంగా 34 షెట్టర్లు ఉండగా.. ఒక్కో షెట్టర్ కు  కేవలం రూ.227 చొప్పున మొత్తం రూ.7,718 ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తున్నారు. మొత్తంగా 62 ఇంటి నంబర్లపై కలిపి ఆర్నెళ్లకు రూ.43,693, ఏడాదికి రూ.87,386 మాత్రమే వసూలవుతోంది.  పద్మానగర్ జీపీలో కొనసాగినప్పటి లెక్కతోనే ఇప్పటికీ చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితమే కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు  రీఅసెస్ మెంట్ చేసి.. కొత్త ట్యాక్స్ ను నిర్ధారించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ -2019లోని సెక్షన్ 94 ప్రకారం కరీంనగర్ డెయిరీలోని నిర్మాణాలను కొలతలు వేసి  ట్యాక్స్ వేస్తే రూ.20 లక్షల మేర వసూలయ్యే అవకాశముంది. 

 రికార్డుల్లో ప్రభుత్వ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా.. 

కరీంనగర్ మిల్క్ ప్రొడ్యుసర్ కంపెనీ లిమిటెడ్ అనేది ప్రైవేట్ కంపెనీ. ఇది ఏ రకంగానూ ప్రభుత్వ రంగ సంస్థ కాదు. కానీ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డుల్లో యూసెజ్ టైప్ అనే కాలమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ డెయిరీ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కమర్షియల్ / ఇండస్ట్రియల్ అని పేర్కొనాల్సి ఉండగా..  స్టేట్ గవర్నమెంట్ అని పేర్కొనడం గమనార్హం. ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకే ఇలా ప్రభుత్వ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నమోదు  చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మినహాయింపు జాబితాలో  నల్లగొండ మెగా డెయిరీ..  

కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ కంపెనీకి తిమ్మాపూర్ మండలం నల్లగొండ జీపీ పరిధిలో మెగా డెయిరీ ఉంది. ఇ–పంచాయతీ రికార్డుల ప్రకారం 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-176 ఇంటి నంబర్ పై ఉన్న  ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2019లో ఏప్రిల్ 1న అసెస్ మెంట్ చేశారు. యూసెజ్ టైప్ అనే కాలమ్ లో ఇండస్ట్రియల్ అని, బిల్డింగ్ క్లాసిఫికేషన్ లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ విత్ సెకండ్ ఫ్లోర్ అని కూడా పేర్కొన్నారు. కానీ జీరో ట్యాక్స్ విధించి మినహాయింపు కేటగిరీలో చేర్చారు.