బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరగనున్న పురుషుల, మహిళల ఐసిసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను మెల్ బోర్న్ లో ఆమె ఆవిష్కరించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనున్న ఐసిసి టీ20 ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ముందే మహిళల టీ20 టోర్నీ జరగనుంది.
మహిళల టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు జరగనుంది. ఈసందర్భంగా కరీనా కపూర్ మాట్లాడుతూ.. “ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నాను. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరుపున ఆడుతున్న మహిళలందరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు రాణించడాన్ని చూడటం నిజంగా చాలా శక్తినిస్తుంది. వారు మనందరికీ స్ఫూర్తిదాయం. భారత క్రికెట్ జట్టు తరపున ఆడిన గొప్ప క్రికెటర్లలో దివంగా మా మామగారు ఒకరు. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉందని తెలిపింది కరీనా కపూర్.

