మలేషియా కోలాలంపూర్ కు చెందిన అజ్రిన్ మొహమాద్ జావావి 20ఏళ్ల నుంచి ఎయిర్ లైన్స్ లో పైలెట్ గా పనిచేశారు. ప్రతీ రోజు ఉదయం 8గంటలకు వైట్ అండ్ వైట్ డ్రెస్ నల్ల క్యాప్ ధరించి విధులకు వెళ్లే వారు. కానీ ఇప్పుడు అదే డ్రెస్ లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా ఎయిర్ లైన్స్ నష్టాల బాట పట్టాయి. దీంతో కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి ఆయా ఎయిర్ లైన్ సంస్థలు. ఈ నేపథ్యంలో అజ్రిన్ మొహమూద్ ను సైతం ఎయిర్ లైన్ సంస్థ విధుల నుంచి తొలగించింది. దీంతో ఉద్యోగం పోవడంతో ఉన్న ఫళంగా ఏం చేయాలో పాలుపోని అజ్రిన్ కు తన స్నేహితుడు సలహాతో క్యాప్టెన్ కార్నర్ పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అజ్రినే స్వయంగా క్యాప్టెన్ డ్రెస్ లోనే డిషెస్ ను తయారు చేసి భోజన ప్రియులకు రకరకాల వంటల్ని రుచి చూపిస్తున్నారు. క్యాప్టెన్ కార్నర్ ఫుడ్ కోర్ట్ లో వంటల్ని టేస్ట్ చేసిన భోజన ప్రియులు లొట్టలేసుకొని మరీ తింటున్నారు.
