కాంగ్రెస్‌‌ నిరాశలో కూరుకుపోతోంది

కాంగ్రెస్‌‌ నిరాశలో కూరుకుపోతోంది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా సీట్లు కోల్పోవడం.. హస్తం నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి చేరుతుండటంతో పార్టీని కాపాడుకోవడం కోసం నాయకత్వాన్ని మరింత పటిష్టంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలంటూ కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ లాంటి పలువురు వెటరన్ లీడర్లు పార్టీ చీఫ్ సోనియాకు లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖ తీవ్ర దుమారాన్ని రేపింది. ఇన్నేళ్లుగా పార్టీని నడిపిస్తూ వస్తున్న గాంధీ కుటుంబీకులను కాదని ఇతరులను పార్టీ చీఫ్‌‌గా ఒప్పుకునేది లేదంటూ పలువురు సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నాయకత్వ మార్పుపై నేతలతో సోనియా చర్చించారు. అంతర్గత ఎన్నికలు నిర్వహణపై హామీ ఇచ్చారు. అయితే ఇది గడిచి చాలా రోజులవుతున్నా విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. పార్టీ నాయకత్వ మార్పునకు సంబంధించి ఎన్నికలను కచ్చితంగా నిర్వహిస్తామని సోనియా చెప్పారని సిబాల్ తెలిపారు. అయితే ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే దాని గురించి తనకు పూర్తి సమాచారం లేదన్నారు. దేశంలో ఓ రాజకీయ శక్తిగా నెగ్గుకురావాలంటే అంతర్గత ఎన్నికలు నిర్వహించి, సరైన నేతలకు పగ్గాలు అప్పజెప్పడం చాలా ముఖ్యమన్నారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల గురించి తాను మాట్లాడబోనని, అయితే కాంగ్రెస్‌‌వాదిగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయని, వారిని తిరిగి ఉత్తేజితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. See more news.. ఆ రెండింటిని చూస్తే అస్సలు ఆగలేను ఫోటోలు స్టేటస్ పెట్టాడని చంపేశారు