ఓట్ల కోసం మా ఊరు రావొద్దు : బోర్డులు పెట్టిన గ్రామం

ఓట్ల కోసం మా ఊరు రావొద్దు : బోర్డులు పెట్టిన గ్రామం

లోక్ సభ ఎలక్షన్స్ నేపథ్యంలో అన్నీ చోట్ల ఎన్నికల ప్రచాలరాలు జోరుగా ఊపందుకుంటే.. ఆ ఊరిలో మాత్రం మా ఊరిలో ప్రచారాలు చేయోద్దని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని కన్నూర్ సమీపంలోని నడువిల్ గ్రామం రాజకీయ పార్టీల ప్రచారాన్ని బహిక్షరించింది.  అంతే కాదు ఊరిలో రోడ్లు బాగు చేస్తేంత వరకు ఓట్లు కూడా వేయమని, లేదా నోటాకి ఓటు వేస్తామని ఊరి జనం చెప్తున్నారు. ఎప్పుడో 50ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లకు ఇప్పటివరకూ మరమ్మత్తులు చేయలేదని నేతలపై ప్రజలు విరుచుకు పడుతున్నారు. 


గ్రామంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందని మరమ్మత్తులు చేయించమని ఎన్ని సార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని గ్రామస్థులు అక్కడి నాయకులపై అసంతృప్తిం వెల్లగక్కుతున్నారు. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లోని రోడ్లు పూర్తి ధ్వంసమైయ్యామని వారు ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొంటలేరు. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలతో తాము విసిగిపోయామని.. ఈసారి రోడ్ల సమస్యను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా మాట వివ్వాలని కోరుతున్నారు. లేదంటే వారంత నోటాకు ఓటు వేస్తామని రాజకీయ నేతలను హెచ్చరిస్తున్నారు.