రేణుకాస్వామి మర్డర్ కేసు: హత్యను దాచటానికి హీరో దర్శన్ రూ.70 లక్షలు ఖర్చు చేశాడా..

రేణుకాస్వామి మర్డర్ కేసు: హత్యను దాచటానికి హీరో దర్శన్ రూ.70 లక్షలు ఖర్చు చేశాడా..

అభిమాని రేణుకుమర్ స్వామి కన్నడ హీరో దర్శన్ హత్య చేసిన ఘటనలో రోజుకో షాకింగ్ న్యూస్ బయటికొస్తోంది. తాజాగా ఈ హత్యను దాచిపెట్టేందుకు దర్శన్ 70లక్షల రూపాయలు ఖర్చు చేశాడని తెలుస్తోంది.ఈ మేరకు దర్శన్ ఇంట్లో నుండి 37లక్షలు, తన భార్య విజయలక్ష్మి నుండి 3లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట దర్శన్ ఈ కేసుతో సంబంధం లేని నలుగురిని లొంగిపోవాలంటూ వారికి 30లక్షలు ఇచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

ఈ హత్యను ఆర్థిక లావాదేవీల వల్ల జరిగినట్లు చిత్రీకరించేందుకు దర్శన్ ప్రయత్నించాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ కేసును దాచేందుకు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు దర్శన్ మొత్తంగా 70లక్షలు ఖర్చు చేశాడని తెలిపారు. ఇందుకోసం తన ఫ్రెండ్ నుండి 40లక్షలు అప్పుగా తీసుకున్నట్టు దర్శన్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.