Kanguva X Review: కంగువ ట్విట్టర్ X రివ్యూ.. సూర్య మూవీ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’(Kanguva). శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇవాళ గురువారం (నవంబర్ 14న) పాన్ ఇండియా వైడ్‌‌గా కంగువ రిలీజైంది.

టీజర్, ట్రైలర్ విజువల్స్ తో భారీ అంచనాలు పెంచిన కంగువ చూశాక.. ఆడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఎవరి టాక్ ఎలా ఉందో.. అంచనాలు తగ్గట్టుగా కథ కథనాలు ఉన్నాయా లేదా.. అనేది చూద్దాం!

సూర్య వ‌న్ మెన్ షోగా కంగువ మూవీ నిలుస్తుంద‌ని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. కంగువ క్యారెక్ట‌ర్‌లో సూర్య ఎంట్రీ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంద‌ని.. కంగువ వ‌ర‌ల్డ్‌లో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతూ థ్రిల్ అవ్వడం పక్కా అని అంటున్నారు. ముక్యనగా ఇందులో యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ అదిరిపోయాయని.. సూర్య‌కు ధీటైన పాత్ర‌లో బాబీ డియోల్ యాక్టింగ్ ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కంగువ అదిరిపోయిందని, పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఫైట్స్, విజువల్స్ ఇలా అన్నీ యాంగిల్స్‌లో శివ అదరగొట్టేశాడని చెబుతున్నారు. కంగువ2 కోసం వేచి ఉండలేను అని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి 

కంగువ ఒక ఎపిక్ బ్లాక్‌బస్టర్.. సూర్య అండ్ బాబీ డియోల్ ఇప్పటి వరకు చేసిన బెస్ట్ సినిమాలలో ఇది నిలుస్తుందని అంటున్నారు.  హీరోయిన్ దిశా పటాని చాలా హాట్‌గా కనిపిస్తోందని.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాప్ టైర్ BGM, ఫేస్‌ఆఫ్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ మరియు VFX & విజువల్స్ టాప్ నాచ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కంగువ ఓ యావరేజ్‌ ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్‌. ఎమోషనల్‌ మిస్‌ అయింది. డైరెక్టర్‌ శివ ఫస్టాఫ్‌ స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్‌ వాల్యూస్‌ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్ చేశాడు.

కంగువ యావరేజ్ లేదా బిలో యావరేజ్ మూవీ అని అంటున్నారు. యావరేజ్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ అటుంచితే.. ముందు ఏం జరుగుతుందో ఊహించేస్తాం.. ప్రిడిక్టబుల్ స్టోరీ.. హీరో, విలన్ల మధ్య వేస్ట్‌గా బిల్డప్ క్రియేట్ చేశారు.. ఇలాంటి స్క్రీన్ ప్లేని ఇది వరకు డైరెక్టర్ శివ ఇదివరకే మూవీస్ లో చాలా చూశామని ఓ నెటిజన్ అన్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే కంగువ బ్లాక్ బస్టర్ హిట్ అని.. క్లైమాక్స్ అదిరిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. సూర్య దుమ్ములేపేశాడని ట్వీట్స్ చేస్తున్నారు .కాగా పూర్తి రివ్యూ కాసేపట్లో చూద్దాం.