Emergency Trailer 2: పవర్ ఫుల్గా ఎమర్జెన్సీ ట్రైలర్.. కంగనా రనౌత్ పొలిటికల్ డ్రామా రిలీజ్ ఎప్పుడంటే?

వరుస వివాదాల్లో చిక్కుకోని ఎట్టకేలకు థియేటర్స్లో రిలీజ్ కానుంది ఎమర్జెన్సీ (Emergency) మూవీ. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2025 జనవరి 17న ఎమర్జెన్సీ మూవీ విడుదల నేపథ్యంలో రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది. 

ఇందులో భాగంగా వచ్చే పాత్రలు, వారి మధ్య నడిచే సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇందిరా గాంధీగా కంగనా తన నటనతో హావభావాలతో ఆకట్టుకుంటోంది. తన డైలాగ్, బాడీ లాంగ్వేజ్ తో ఇందిరాగాంధీ పాత్రలో ఎలా లీనమైందో తెలుస్తోంది. 

ఎమర్జెన్సీ చిత్రం 1975లో శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా  తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 6వ తారీఖున విడులా కావాల్సి ఉంది. కానీ పలు అనుకోని కారణాలవల్ల విడుదల ఆగిపోయింది. 

గతంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలు సిక్కు శనగలు సంఘాలు ఎమర్జెన్సీ చిత్రంలో మత విద్వేషాలు రచ్చగొట్టే మరియు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని విడుదల నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటినుంచి ఎమర్జెన్సీ చిత్రం కష్టాలు ఎదుర్కుంటోంది. ఇక ఎట్టకేలకు 2025 జనవరి 17 న వస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికేట్ జారీ చేయబడింది. చివరకు 13 కట్‌లు సెన్సార్ సూచించింది.

Also Read : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్

'ఎమర్జెన్సీ' మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, మిళింద్ సోమన్, మహిమ చౌదరి, భూమిక చావ్లా, శ్రేయాస్ టాల్పడే తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, సామ్ మానెక్షాగా మిలింద్ సోమన్, పుపుల్ జయకర్ పాత్రలో మహిమా చౌదరి నటించారు. ఇది చివరిసారిగా దివంగత సతీష్ షాను కూడా తెరపై చూస్తుంది. జగ్జీవన్ రామ్ పాత్రలో ఆయన నటిస్తున్నారు.