ముంబై : చాలా కాలం తరువాత మనాలీ నుంచి ముంబైకి వచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగన రౌనత్ ట్రోల్ అవుతున్నారు. మనాలీ నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ కు తన సోదరి రంగోలి చందేల్ ఆమె భర్త పృథ్వీరాజ్ తో కలిసి వచ్చారు. టైట్ ఫిట్ స్కర్ట్, వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో టాప్ ,లాంగ్ ట్రెంచ్ కోర్ట్ జతగా లెదర్ షూ దరించిన కంగన ఎయిర్ పోర్ట్ లోపలి నుంచి భయట కారు దగ్గరకు వచ్చే సమయంలో టైట్ సెక్యూరిటీ మధ్య మీడియాకు ఫోజులిచ్చింది. కంగన క్యాస్ట్యూమ్స్ సంగతి పక్కన పెడితే.., రైతుల్ని ఉగ్రవాదులతో పోలీస్తూ ఆమె చేసిన కామెంట్లపై మండిపడుతున్నారు.
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న కంగనా.., రైతుల ఆందోళనపై స్పందించింది. కేంద్ర చట్టాల్ని వ్యతిరేకిస్తున్న రైతుల్లో ఓ వృద్దురాల్ని ఉద్దేశిస్తూ షాహీన్‌బాగ్ బామ్మ రూ.100 ఇస్తే చాలు ఇలాంటి ఆందోళనలకు వచ్చేస్తారు’ అని ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసింది. అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలతో పాటు పంజాబీ సింగర్ దిల్జిత్.. కంగనపై విమర్శల వర్షం కురిపించారు.
నువ్వు కరణ్‌జోహార్ పెంపుడు జంతువు. పౌరచట్టం కోసం ఆందోళన చేసిన ఆ బామ్మే ఇప్పుడు రైతుల కోసం నిరసనలు చేస్తుందని మాత్రమే ట్వీట్ చేశా. ఇప్పుడు ఈ డ్రామా ఏంటి?’ అని దిల్జిత్ పెట్టిన ట్వీట్‌పై మండిపడింది.
కంగన ట్వీట్ కు ‘నువ్వు ఎవరితో అయితే కలిసి పనిచేశావో వాళ్లందరికీ నువ్వు కూడా పెంపుడు జంతువేనా? అలా అయితే ఆ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఇది బాలీవుడ్ కాదు. పంజాబ్. మనుషుల భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో నీకు బాగా తెలుసు’ అని దిల్జిత్ ధీటుగా స్పందించారు. ఈ వివాదం తరువాత మనాలీ నుంచి ముంబైకి వచ్చిన కంగనాను ఉద్దేశిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ ప్రజలు తన గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఎలా వచ్చిందో చూడండి అంటూ కామెంట్ చేశాడు.
మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కానీ మీరు ఆ గౌరవాన్ని కోల్పోయారంటూ మరో యూజర్ ట్వీట్ లో పేర్కొన్నాడు.
నిరసన తెలిపిన రైతులను టెర్రరిస్టులతో పోల్చినందుకు సిగ్గుపడాలి అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
