IND Vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. రెండో టెస్టుకు విలియంసన్ దూరం

తొలి టెస్టులో భారత్ పై గెలిచి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్ కు బిగ్ షాక్ షాక్ తగిలింది. పూణే వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కివీస్ స్టార్ బ్యాటర్ విలియంసన్ దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా అతను ఇంకా కోలుకోలేదని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ఒక ప్రకటనలో తెలిపాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో విలియంసన్ గాయపడ్డాడు.    

ప్రస్తుతం విలియంసన్ వైద్య పర్యవేక్షణలో ఉన్నాడని.. అతను 100 శాతం ఫిట్ గా లేడని ఆయన అన్నారు. కేన్ కోలుకోవడానికి సరిపోయేంత సమయం ఇస్తామని.. అతను మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని గ్యారీ స్టెడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో తొలి టెస్ట్ ఆడిన జట్టుతోనే కివీస్ రెండో టెస్టులో బరిలోకి దిగొచ్చు. విలియంసన్ స్థానంలో వచ్చిన యంగ్ తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ ల్లో చక్కగా ఆడి ఆకట్టుకున్నాడు. 

Also Read :- గైక్వాడ్‌కు పగ్గాలు.. భారత్ ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా రెండో టెస్టు ప్రారంభమవుతుంది. తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా కివీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండో టెస్టులోనూ ఇదే జోరు కొనసాగించి సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. మరో వైపు ఇండియా రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.