NZ vs ENG: బ్యాడ్ లక్ అంటే ఇదే: చేజేతులా వికెట్ పారేసుకున్న విలియంసన్

ఫామ్ లో ఉన్న బ్యాటర్ చేజేతులా వికెట్ పారేసుకుంటే ఎంత బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ విలియంసన్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్న ఈ కివీస్ స్టార్.. ఊహించని రీతిలో ఔటై తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంగ్లాండ్ తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఇన్నింగ్స్ 59 ఓవర్ లో పాట్స్ వేసిన చివరి బంతిని విలియంసన్ డిఫెన్స్ ఆడాడు. బంతి స్టెప్ పడి క్రీజ్ వెనక్కి వెళ్ళింది. ఇది గమనించిన విలియంసన్ బంతి వికెట్లను తగులుతుందేమో అని కాలితో బంతిని పక్కకు లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి వెళ్లి సరాసరి వికెట్లను తగిలింది. దీంతో తన వికెట్ కు తానే విలియంసన్ పోగొట్టుకున్నాడు. తీవ్ర నిరాశకు గురైన కేన్ బాధతో పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో 44 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న ఈ కివీస్ స్టార్ ఊహించని రీతిలో ఔట్ కావడం విచారానికి గురి చేస్తుంది. 

ALSO READ | IND vs AUS 3rd Test: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. క్రీజ్ లో సాంట్నర్ (50),విలియం ఒరోర్కే(0) ఉన్నారు. 63 పరుగులు చేసిన కెప్టెన్ టామ్ లాతమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో పాట్స్, అట్కిన్సన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. కార్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్ కు ఒక వికెట్ దక్కింది.