కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందని.. వేదాలు జీవితంలో సత్మార్గానికి దారి చూపుతాయని అన్నారు. మనిషి ఆచరించాల్సిన నియమాలు, చేయకూడని పనులు సనాతన ధర్మం చెప్తుందన అన్నారు.
విశ్వ శాంతికి భారత దేశం ముందడుగు వేస్తోందని అన్నారు. ధర్మప్రచారం చేయడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని.. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మపరిరక్షణకు కేంద్ర బిందువని అన్నారు.నిర్వాహకులు, భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా, శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలని అన్నారు.
ALSO READ | దేవుడా : తిరుమల కొండపై.. ఏసుక్రీస్తు గుర్తులతో ఉన్న వస్తువుల అమ్మకం
ధర్మప్రచారానికి నూతన పాలకమండలి కంకణ బద్దలై ఉన్నారని.. ప్రతి గ్రామంలో ధర్మప్రచారం చేపట్టేలా కృషి చేయాలని అన్నారు. దేవస్థానం యొక్క ద్రవ్యాన్ని ధర్మ పరిరక్షణ కోసం వినియోగించాలని అన్నారు.2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు గంగాతీరంలో కుంభ మేళా జరగనుందని.. ఈ కుంభమేళాలో ధర్మప్రచారం కోసం టీటీడీ నమూనా దేవాలయం, వేదపారాయణం, హోమాలు, స్వామి వారి ప్రసాదాలు అందించనున్నట్లు తెలిపారు.