కమల్ పార్టీ ఎన్నికల గుర్తు మళ్లీ టార్చ్ లైట్

కమల్ పార్టీ ఎన్నికల గుర్తు మళ్లీ టార్చ్ లైట్

కమల్‌ హాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి ఎన్నికల సంఘం మరోసారి టార్చ్ లైటు గుర్తునే కేటాయించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టార్చ్ లైటు గుర్తును కేటాయించడంతో ఆ పార్టీ సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. పార్టీ గుర్తు కేటాయింపుపై స్పందించి కమల్‌… అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ జన్మదినం రోజునే ఈ నిర్ణయం రావడం సంతోషంగా ఉందన్నారు. తమకు టార్చ్ లైట్ గుర్తును కేటాయించినందుకు ఎలక్షేన్ కమిషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. మనందరం కలిసి వెలుగును వ్యాపింప చేద్దామంటూ మిత్రపక్షాలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అప్పట్లోనే ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్ లైటు గుర్తు కేటాయించింది.