తొక్కిసలాటలో గాయపడ్డ కమల్..ప్రచారానికి దూరం

తొక్కిసలాటలో గాయపడ్డ కమల్..ప్రచారానికి దూరం

సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమలహాసన్ గాయపడ్డారు. దక్షిణ కోయంబత్తూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా..అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. తొక్కిసలాటలో వారు కమల్ మీద పడటంతో పాటు ఆయన కాలిని తొక్కారు. ఈ ఘటనలో కమల్ కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్ల సూచనతో ప్రచారాన్ని ఆపేశారు.

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కమల్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. గత సోమవారం ఆయన నామినేషన్ వేశారు. కమల్ పార్టీ తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.